'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

CTR: చౌడేపల్లి మండలంలోని పుదిపట్ల ఉన్నత పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం మండల ప్రత్యేక అధికారి విజయ్‌కుమార్ పర్యవేక్షించారు. ఈ మేరకు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ.. నాణ్యతతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. అనంతరం భోజనశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించి, పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు.