పాఠశాల బస్సును ఢీ కొట్టిన లారీ

పాఠశాల బస్సును ఢీ కొట్టిన లారీ

SDPT:  ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును లారీ వెనక నుంచి ఢీ కొట్టిన సంఘటన చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీంనగర్ రాజీవ్ రహదారిపై బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల విద్యార్థులను ఎక్కించుకునేందుకు స్టేజీ వద్ద బస్సు ఆగగా లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. దీనితో బస్సులోని పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.