VIDEO: ఆటో డ్రైవర్‌లను ఆదుకోవాలి: CITU

PPM: మహిళలకు ఉచిత బస్ పథకం కారణంగా నష్ట పోతున్న ఆటో, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర పధకం అమలు చెయ్యాలని ఆ యూనియన్ గౌరవ అధ్యక్షులు NY. నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఆదివారం సాలూరులో ఆటో డ్రైవర్లు CITU ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నినాదాలు చేసుకుంటూ ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి డ్రైవర్‌కు రూ. 15 వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.