VIDEO: పరీక్ష కేంద్రం వద్ద మత ప్రచారం.. నిలదీసిన తల్లిదండ్రులు!

VIDEO: పరీక్ష కేంద్రం వద్ద మత ప్రచారం.. నిలదీసిన తల్లిదండ్రులు!

NTR: కానూరులోని ఒక పరీక్ష కేంద్రం వద్ద బైబిళ్ల పంపిణీ కలకలం రేపింది. పరీక్ష రాయడానికి వస్తున్న విద్యార్థులను అడ్డుకుని, కొందరు క్రైస్తవ మత బోధకులు బైబిళ్లను పంపిణీ చేశారు. "ప్రభువును నమ్ముకుంటేనే పరీక్షలు పాస్ అవుతారు, లేదంటే ఫెయిల్ అవుతారు" అంటూ చేసిన వ్యాఖ్యలపై తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు. విద్యా సంస్థల వద్ద ఇలాంటి మత మార్పిడి యత్నాలు చేయడంపై వారిని నిలదీశారు.