VIRAL: రూ.4 కోట్లు గెలుచుకున్న లక్కీ పర్సన్

ప్రస్తుతం ఎక్కడ చూసినా IPL హవా కొనసాగుతుంది. ఈ క్రమంలో కొందరు IPL అభిమానులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా, ఓ అభిమాని డ్రీమ్ 11లో రూ.39 పెట్టి రూ.4 కోట్లు గెలుచుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాకు చెందిన మంగళ్ సరోజ్‌ను ఈ అదృష్టం వరించింది. దీంతో సంతోషం వ్యక్తం చేస్తూ అతను మీడియాతో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.