వచ్చే నెల మూడవ వారానికి నవోదయం 2.O పూర్తి కావాలి

VZM: ప్రాబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవోదయం 2.0 కార్యక్రమాన్ని వచ్చే నెల మూడో వారం సరికి పూర్తిచేయాలని ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు అధికారులకు సూచించారు. కొత్తవలస ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలాల్లోనూ, గ్రామంలోనూ నాటుసారా అమ్మకం జరుగకుండా చూడాలన్నారు.