VIDEO: మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
NLG: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 917.93 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 644.30 అడుగుల వద్ద ఉంది. దీంతో అధికారులు ఒక్క గేటును ఒక అడుగు మేర ఎత్తి, దిగువ ప్రాంతాలకు 825.37 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.