5న కాణిపాకంలోసంకటహర గణపతి వ్రతం

5న కాణిపాకంలోసంకటహర గణపతి వ్రతం

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈనెల 5న సంకటహర గణపతి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9గంటలకు, 11 గంటలకు, సాయంత్రం 5గంటలకు మూడు విడతలుగా వ్రతం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.500 టికెట్టు కొనుగోలు చేసి వ్రతంలో పాల్గొనవచ్చని సూచించారు. సాయంత్రం 7 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తామన్నారు.