'మద్యం సేవించి వాహనాలు నడపరాదు'

'మద్యం సేవించి వాహనాలు నడపరాదు'

SRCL: వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని బోయినపల్లి మండల బ్లూ కోర్ట్ పోలీసులు సూచించారు. బోయినపల్లి మండల కేంద్రంలో విస్తృతంగా పోలీసులు తనిఖీ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అలాగే వాహనాల ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధించారు.