చెత్తపై అవగాహన కల్పించిన అధికారులు.!

చెత్తపై అవగాహన కల్పించిన అధికారులు.!

BPT: అద్దంకి మండలంలోని చక్రాయపాలెం పంచాయతీలో ఎంపీడీవో వరూధిని మంగళవారం పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీడీవో, సీఆర్పీలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ.. తడి, పొడి చెత్త విభజనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చెత్తను వేరు చేయకుండా రోడ్లపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పారిశుద్ధ్య కార్మికులకు సహకరించి గ్రామాన్ని రోగాల రహితంగా తీర్చిదిద్దాలని అన్నారు.