బైక్ ర్యాలీ నిర్వహించిన AITUC నాయకులు
కడపలో AITUC రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఇవాళ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, పాత బస్టాండ్ మీదుగా జిల్లా పరిషత్ వరకు సాగింది. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.