బాలికపై మారు తండ్రే లైంగిక వేధింపులు
ELR: జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంలో మారు తండ్రి 10 ఏళ్లబాలికపై అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక మేనమామ లక్కవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడు బోడ రవిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఏ.ఎస్.ఐ భాస్కర్ తెలిపారు. నాగులగూడెం గ్రామానికి చెందిన మహిళ భర్తతో విడిపోయి తన కూతురితో పాటు రవితో కలిసి జీవిస్తుంది.