పార్టీ లైన్ దాటితే సహించేది లేదు: CBN
AP: తెలుగుదేశం పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఎవరైనా సహించేది లేదని సీఎం చంద్రబాబు TDP నేతలను హెచ్చరించారు. తిరువురు TDP వివాదానికి కారణమైన MP కేశినేని చిన్ని, MLA కొలికపూడి శ్రీనివాసరావుతో తాను మాట్లాడతానని అన్నారు. అప్పటికీ పరిస్థితి చక్కబడకపోతే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని ఇరువురికీ తెలియజేయాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి సూచించారు.