అనుమతి లేకుండా డీజే ఆపరేట్.. సీజ్ చేసిన పోలీసులు

HYD: మీర్‌పేట్‌లో అనుమతి లేకుండా డీజే ఆపరేట్ చేస్తున్న వారిపై పోలీసులు ఆదివారం చర్యలు తీసుకున్నారు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీలో గణేష్ విగ్రహం ఊరేగింపు సందర్భంగా అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో డీజే ఆపరేటర్ విష్ణు, యజమాని నోముల నిఖిల్ గౌడ్‌లపై కేసు నమోదు చేసి డీజే వాహనాన్ని సీజ్ చేశారు.