నంద్యాల వద్దు.. కర్నూలు ముద్దు: DSU
NDL: నందికోట్కూరును కర్నూలు జిల్లాలో కలపాలని డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ జిల్లా కార్యదర్శి వేటూరి రంగ స్వామి డిమాండ్ చేశారు. శనివారం నందికోట్కూరులోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి, 30 కి.మీ ఉన్న కర్నూలు కాకుండా, 60 కి.మీ ఉన్న నంద్యాలలో కలపడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.