'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'
SKLM: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆముదాలవలస ఎస్సై కాంతారావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమదాలవలస మండలంలో పలు ప్రాంతాలలో ఎస్సై పర్యవేక్షణలో సంకల్పం కార్యక్రమం పోలీసులు నిర్వహించారు. మహిళా భద్రత, ఉమెన్ సేఫ్టీ, శక్తి యాప్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, సైబర్ నేరాల, ఈవ్ టీజింగ్ ప్రతి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.