రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
NLG: కొండమల్లేపల్లి పట్టణ సమీపంలోని సంజీవని ట్రస్ట్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన చెన్నకేశవులు గౌడ్‌గా గుర్తించారు. మృతుడు కొండమల్లేపల్లి పట్టణంలో నివాసముంటూ బోర్ బండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.