VIDEO: 'త్రాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోండి'

VIDEO: 'త్రాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోండి'

NTR: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఢ్యానచంద్ర, వర్షాకాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరాలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో, త్రాగునీటిలో ఎటువంటి లోపం లేకుండా, శుద్ధమైన నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహిస్తూ, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని సూచించారు.