పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి: భట్టి
VKB: రాష్ట్రంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వారానికి మూడు రోజుల పాటు ప్రజాబాట వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు Dy.cm భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ పరిగిలో రూ. 750 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నామని, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు.