72 గంటలే గడువు.. లేదంటే భారీ పెనాల్టీ
జాతీయ రహదారులపై కేంద్రం కొత్త టోల్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకపై టోల్ చెల్లించని వాహనదారులకు నేరుగా ఈ-నోటీసులు అందుతాయి. నోటీసు అందిన 72 గంటల్లోపు అసలు టోల్ ధర చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ గడువు దాటితే మాత్రం రెట్టింపు(2x) జరిమానా కట్టాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఈ 'బారియర్-లెస్' విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది.