మాంసం ప్రియులకు షాక్.. ఈ రోజు దుకాణాలు బంద్

మాంసం ప్రియులకు షాక్.. ఈ రోజు దుకాణాలు బంద్

VZM: మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మంగళవారం మాంసం దుకాణాలు మూసి వేయాలని అధికారులు సోమవారం నోటీసు జారీ చేశారు. AP మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1955 సెక్షన్‌ 533(b) ప్రకారం మహావీర్‌ జయంతి సందర్భంగా ఇవాళ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. ఈ మేరకు నగరంలోని అన్ని మాంసం షాపులు పూర్తిగా మూసివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.