15 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుంది: నాగబాబు
AP: మళ్లీ జగన్ అధికారంలోకి రాకూడదనే కూటమితో జనసేన పొత్తు పెట్టుకున్నట్లు జనసేన ఎమ్మెల్యే నాగబాబు తెలిపారు. మరోసారి వైసీపీకి అవకాశం ఇచ్చి ఉంటే ప్రజలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆరోపించారు.