VIDEO: 'బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవు'
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో సీఐ శ్రీనివాసరావు తనిఖీలు నిర్వహించారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగినా, వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిమానాలు విధించి కేసులు నమోదు చేస్తామన్నారు.