'అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

'అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

SRCL: అటవీ అమర వీరుల త్యాగాలు మరువలేనివని, వేములవాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖలీలుద్దీన్ అన్నారు. గురువారం అటవీ అమరవీరుల దినోత్సవం వేములవాడ అటవీశాఖ అధికారులు నిర్వహించారు. అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖలిలుద్దీన్ మాట్లాడుతూ.. అటవీ సంపదను కాపాడే క్రమంలో ఎందరో ఉద్యోగులు బలయ్యారన్నారు. అటవీ అధికారులు పాల్గొన్నారు.