గ్యాస్ ఏజెన్సీలో అధికారుల తనిఖీలు
KRNL: కోడుమూరులోని ఎస్‌ఎన్‌ఆర్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో ఇవాళ సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.