VIDEO: సిద్ధవటంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
KDP: మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం సిద్దవటం మండలంలో మోస్తాదు చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతంగా మారి ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు పడుతుండడంతో గ్రామాల్లో వీధులు చిత్తడిగా మారాయి. పనులకు బయలుదేరిన కూలీలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.