RTCలో 3,038 పోస్టుల భర్తీ: సజ్జనార్

HYD: ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు. పోస్టుల భర్తీతో ఉద్యోగులు, కార్మికులపై పనిభారం తగ్గుతుందని తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.