'కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలి'

'కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలి'

MNCL: పత్తి కొనుగోలు ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలని పలువురు రైతులు కోరారు. సోమవారం మందమర్రి మండలంలోని రైతు వేదికలో ఏర్పాట్లు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. యాప్ ఆధారంగా కేవలం 7 క్వింటాళ్ల వరకు మాత్రమే పత్తిని కొనుగోలు చేయడం వల్ల తీవ్రంగా నష్ట పోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొనుగోలు పరిమితిని 12 క్వింటాళ్ల వరకు పెంచాలన్నారు.