లిక్విడ్ గంజాయి పట్టివేత

లిక్విడ్ గంజాయి పట్టివేత

AKP: గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ఎస్సై రుషికేశ్వరరావు తన సిబ్బందితో కలిసి మంగళవారం ఏఎల్.పురం గ్రామ శివారులో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు కేటీఎం బైక్‌పై 1 కేజీ లిక్విడ్ గంజాయి తరలిస్తున్న గుంటూరు జిల్లా వ్యక్తులు శ్రీకాంత్, జోసెఫ్ థాంబీని పట్టుకున్నారు. గంజాయి, బైక్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.