'అఖండ 2' ట్రైలర్ రిలీజ్.. ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా 'అఖండ 2'. డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. అయితే ఈ నెల 21న బెంగళూరు సమీపంలోని చింతామణిలో దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న వైజాగ్ జగదాంబలో సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉండనున్నట్లు, బాలయ్య పాల్గొననున్నట్లు టాక్ వినిపిస్తోంది. USలో DEC 1,2,3 తేదీల్లో ఈవెంట్లను నిర్వహించనున్నారట.