BJP రాష్ట్ర అధికార ప్రతినిధిగా డా.రవికుమార్
SRD: బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డా. రవికుమార్ గౌడ్ నియమితులయ్యారు. కంగ్టి మండలం భీమ్రా గ్రామానికి చెందిన రవికుమార్ గౌడ్ గత ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కన్వీనర్‌గా ఉన్నారు. జిల్లాకు చెందిన మరొకరు సంగప్ప జనవాడే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.