గ్యాస్ సిలిండర్ వినియోగంపై మహిళలకు అవగాహన

VZM: దత్తి రాజేరు మండలం పెదకాద గ్రామంలో ఆదివారం హెచ్పి గ్యాస్ ఏజెన్సీ మహిళలకు గ్యాస్ వినియోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల వలన అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఒక్కరు గ్యాస్ సిలిండర్ వినియోగించే మందు సిలిండర్ కు ఉన్న వాచర్ తప్పకుండా గమనించాలని తెలిపారు.