పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎస్పీ
BHNG: భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌ను భువనగిరి డీఎస్పీ బండారి రవీందర్ యాదవ్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో రోజువారి కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో తీసుకోవాల్సిన విషయాలపై సూచనలు చేశారు. పోలీసులు పబ్లిక్‌తో ఏ విధంగా వ్యవహరించాలో అవగాహన కల్పించారు.