ఓట్ల కోసం మా వాడకు రాకండి అంటూ హెచ్చరిక ఫ్లెక్సీ

PDPL: 'ఓట్ల కోసం మా వాడకు రాకండి' అంటూ పాలకుర్తి మండలం రామరావుపల్లి గ్రామస్థులు స్థానిక ఎన్నికల్లో పోటీచేసే సర్పంచ్, MPTC, ZPTC అభ్యర్థులను హెచ్చరిస్తూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. '30ఏళ్ల నుంచి సరైన విద్యుత్ సౌకర్యం లేదు, ఇళ్లకు విద్యుత్ మీటర్లు లేవు, వీధి దీపాలు లేవు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పరిష్కరించాలన్నారు.