నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
GNTR: దుగ్గిరాల మండలం పెదపాలెం ఫీడర్ కింద విద్యుత్ లైన్ల ఏర్పాటు పనుల కారణంగా సోమవారం పెదపాలెం, చినపాలెం, పేరకలపూడి, చుక్కపల్లివారిపాలెం గ్రామాల్లో వ్యవసాయ, గృహ అవసరాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని డిస్కం ఏఈ గోపి ఆదివారం తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.