చెరువును తలపిస్తున్న రహదారి

చెరువును తలపిస్తున్న రహదారి

SKLM: లక్ష్మీ నర్సుపేట మండలంలోని బొత్తాడిసింగి రహదారి చెరువును తలపిస్తుంది. లక్ష్మీ నర్సుపేట జంక్షన్ నుండి గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టారు. గత కొన్నేళ్లుగా రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడంతో అధ్వానంగా మారింది. ఏ మాత్రం వర్షం కురిసినా గుంతల్లో నీరు చేరి దుర్గంధం వెదజెల్లుతుంది. ఈ రహదారి గుండా మైదాన,గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.