'ట్రాన్స్ జెండర్స్ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి'
WGL: ట్రాన్స్ జెండర్స్ వారి హక్కులను తెలుసుకొని ఉంటే, వేరే ఇతర వ్యక్తుల వేధింపుల నుండి రక్షించు కొనగలుగు తారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ ఛైర్‌పర్సన్ వి.బి. నిర్మలా గీతాంబ అన్నారు. శనివారం రాత్రి జిల్లా న్యాయ సేవా సదన్ బిల్డింగ్‌లో జరిగిన ట్రాన్స్ జెండర్ వ్యక్తుల హక్కులపై అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.