సింహాచలం కొండపై అభివృద్ధి పనులు
VSP: సింహాచలం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంకటరావు, వచ్చే నెలలో జరగనున్న చందనోత్సవం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని హెచ్చరిస్తూనే, భక్తుల భద్రత మరియు సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.