VIDEO: కదిరిలో ముస్తాబైన బ్రహ్మరథం
సత్యసాయి: కదిరిలో ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మరథోత్సవానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8:25 నుంచి 8:45 గంటల మధ్య రథం కదలనున్న నేపథ్యంలో అధికారులు రథాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు తరలివస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అధికారులు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.