ప్రశ్నపత్రాల రవాణాకు ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు
KDP: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరగేందుకు జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి విద్యార్థులపై ఫ్రిస్కింగ్ నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల నిషేధం, సెక్షన్ 144 అమలు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రశ్నపత్రాల రవాణాకు ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.