బండలాగుడు పోటీలను ప్రారంభించిన: మాజీ ఉప ఎంపీపీ

బండలాగుడు పోటీలను ప్రారంభించిన: మాజీ ఉప ఎంపీపీ

KDP: పాలేటి గంగమ్మ తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కమలాపురం మండల పరిధిలోని టీ చదిపిరాల్ల, గొల్లపల్లి గ్రామాలలో పాల పళ్ళ విభాగం వృషభరాజల బండలాగుడు పోటీలను మాజీ ఉప మండల అధ్యక్షులు వాసుదేవ రెడ్డి ప్రారంభించారు. బండలాగుడు పోటీలలో 14 జతల ఎద్దులు పాల్గొన్నాయి. గెలుపొందిన ఎద్దుల యజమానులకు నగదు బహుమతులు అందజేయనున్నారు.