బాలశక్తి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

బాలశక్తి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

GDWL: రాష్ట్రీయ బాల శక్తి పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా శిశు సంక్షేమ అధికారిణి సునంద ప్రకటనలో తెలిపారు. ఈ నెల చివరిలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 6 నుంచి 18 ఏళ్ల లోపు బాల బాలికలు అర్హులు అన్నారు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, మంచి అభ్యసనం, సాంస్కృతిక కళలు, సాహసం, క్రీడలు సామాజిక సేవా రంగాలలో దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు.