విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

MNCL: విద్యుత్ షాక్ తగిలి బీహార్‌కు చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన మందమర్రి మండల కేంద్రంలోని బస్టాండ్ అంగడి ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి ఇంట్లో కూలర్‌ను రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.