పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
KNR: హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య బోర్నపల్లి ప్రాథమిక, సెకండరీ పాఠశాలల వంటశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలల్లో అపరిశుభ్రత కనిపించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలోనే వంటలు చేయాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.