ఐదు పిల్లలకు జన్మనిచ్చిన ముకి చీతా
MP కునో నేషనల్ పార్క్‌లో జన్మించిన 33 నెలల చీతా ముకి తాజాగా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. భారతీయ చీతా సంతానం విజయవంతం కావటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటన భారత్‌తో సహజసిద్ధంగా, జెనెటికల్ వైవిధ్యంతో కూడిన చీతా జనాభా పెరుగుదలకు బలం చేకూరుస్తుందన్నారు. ఈ ఐదు పిల్లులు ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.