పొలం వద్ద ఉంచిన స్కూటర్ చోరీ
NLR: సంగం సమీపంలోని జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న బైకు దొంగతనానికి సోమవారం గురైంది. గ్రామానికి చెందిన వంశి అనే అతను తమ పొలంలో వ్యవసాయ పనులు చూసుకునేందుకు వెళ్తూ పొలం పక్కన స్కూటర్ ఆపాడు. ఆయన పొలం పనులు చూసుకొని వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు స్కూటర్‌ను దొంగలించారు. ఈ విషయాన్ని పోలీసులకు వంశీ ఫిర్యాదు చేశారు.