32 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

32 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

సూర్యాపేట పట్టణంలోని చైతన్య భారతి కళాశాలలో చదువుకున్న 1991-1993 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఆదివారం పట్టణంలో ఒకే వేదికపై కలుసుకున్నారు. ఆనాడు వారికి బోధించిన గురువులను పిలిచి, శాలువాలతో, పూలమాలతో, ఘనంగా సన్మానించుకున్నారు. వారు చిన్నప్పుడు చేసిన చిలిపి పనులను జ్ఞాపకం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.