పోలవరం ముగింపులేని కథ: అంబటి
AP: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పోలవరాన్ని బ్యారేజీకి పరిమితం చేశారని మండిపడ్డారు. 'అమరావతి అంతులేని కథ.. పోలవరంది ముగింపు లేని కథగా మార్చారు. పోలవరాన్ని చంద్రబాబు ATMలా వాడుకుంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. కానీ డబ్బులు కొట్టేయటానికి ఏపీకి బదలాయించుకున్నారు' అని ఆరోపించారు.