బాధితులకు తక్షణ న్యాయం అందించాలి: ఎస్పీ
NLG: బాధితుల ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, మెరుగైన సేవలందించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. మంగళవారం ఆయన తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో అలసత్వం వహించరాదని, గంజాయి, అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు.