పాలేరు యూటీని పరిశీలించిన సీఈ

KMM: కూసుమంచి మండలంలోని పాలేరు వద్ద ఎడమ కాల్వకు నిర్మించిన యూటీ (అండర్ టన్నెల్)ను జలవనరుల శాఖ సీఈ రమేష్ బాబు పరిశీలించారు. ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు ద్వారా వివరాలు ఆరా తీయగా, యుద్ధప్రాతికన పనులు పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అయితే, మిగిలిన చిన్నచిన్న పనులు కూడా త్వరగా పూర్తిచేయాలని సీఈ సూచించారు.